Terms and Conditions

నియమాలు మరియు నిబంధనలు

నియమాలు మరియు నిబంధనలు

దేవనాగరి (“ద సైట్”) యొక్క వెబ్ సైట్ యొక్క నియమ నిబంధనలు (“టి&సి”) ఇలా ఉన్నాయి.దేవనాగరి (“సర్వీసులు”) యొక్క ఏవైనా సర్వీసులు, ఉత్పాదనలు, అంశాలు మరియు మెటీరియల్స్ ఉపయోగించే ముందుగా, దయచేసి ఈ నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి.ఈ నియమ నిబంధనలనేవి మీకు మరియు దేవనాగరికి మధ్య దేవనాగరి సర్వీసులను మీరు ఉపయోగించుకొనుటకు సంబంధించిన చట్టపరమైన ఒప్పదం.ఒకవేళ మీరు ఈ షరతులను అర్థం చేసుకోలేకపోతే, మీరు స్వతంత్ర చట్టపరమైన సలహాను కోరవచ్చు.ఈ షరతుల క్రింద మీ హక్కు అనేది మీకు వ్యక్తిగతమైనది మరియు ఎలాంటి తృతీయ పక్ష ప్రయోజనకారి హక్కులను కలిగి ఉండదు.మీరు అనువాదకుడైనా లేదా ప్రాజెక్ట్ ఓనర్ అయినా ఎవరైనా సరే ఒక సారి మా సర్వీసులను ఉపయోగించుకుంటే ఈ నియమనిబంధనలకు లోబడి ఉండునట్లుగా మీరు సమ్మతిస్తారు.

దేవనాగరి తన విచక్షణా అధికారంతో మరియు ఏ సమయంలోనైనా మీకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఈ నియమ నిబంధలన్నీ లేదా వీటిలో ఏదైనా భాగాకి జోడించుటకు, తొలగించుటకు లేదా సవరించుటకు హక్కును కలిగి ఉంది.ఈ నియమనిబంధనలకు అప్డేట్స్ మరియు మార్పులు తెలియపరచబడి, ఇదివరకు ఈ నియమ నిబంధనలు తెలుపబడిన యుఆర్‌ఎల్ ద్వారానే తెలుపబడతాయి.ఈ నియమ నిబంధనల ఆరంభంలోనే “చివరిగా అప్డేట్ చేయబడిన” తేదీని కూడా దేవనాగరి అప్డేట్ చేస్తుంది.యూజర్లు, ఈ నియమ నిబంధనల యొక్క ఇటీవలి వెర్షన్స్ ను, గోప్యతా పాలసీలతో సహా, మరియు వీటికే పరిమితం కాకుండా, కాలానుగుణంగా సమీక్షించాలి.

మా సేవలను వినియోగించుకోవడం ద్వారా, మీరు ఈ నియమ నిబంధనలకు సమ్మతిస్తున్నట్లుగా భావించబడుతుంది.మీరు ఈ నియమనిబంధనలకు సమ్మతించకపోయినట్లయితే, మా సర్వీసులను వినియోగించుకొనుటకు మీకు హక్కులు మంజూరు చేయబడవు మరియు మీరు దేవనాగరికి ప్రాప్యత పొందలేరు.ఈ వెబ్ సైట్ లో ఉన్న అంశాలు మరియు విషయాలన్నీ వాటికి వర్తించగల కాపీరైటు మరియు ట్రేడ్ మార్క్ చట్టాల ద్వారా సంరక్షించబడ్డాయి.

దేవనాగరి యొక్క వినియోగం

మీరు దేవనాగరిని అంతర్జాతీయ, రాష్ట్ర, సమాఖ్య మరియు స్థానిక చట్టాలకు వర్తించులాగా ఈ నియమ నిబంధనలతో అనుగుణంగా వినియోగించాలి.

మీరు దీని నుండి నిషేధించబడ్డారు:

  • దేవనాగరిలోని ఏ భాగాన్నయినా, దేవనాగరి నుండి నిర్దిష్టంగా తెలుపబడినది తప్ప, విక్రయించడం, తిరిగి విక్రయించడం లేదా ఏదైనా ఉద్దేశాల కొరకు ఆఫర్ చేయడం;
  • దేవనాగరి నుండి డేటాబేస్ లేదా ఇతర ప్రాజెక్ట్ లో భాగంగా అంశాలను మరియు విషయాలనుసేకరించడం;
  • దేవనాగరి లేదా దేవనాగరిలోని ఏ భాగమైనా మరొక వెబ్ సైట్ లేదా సర్వీసులో భాగంగా ఫ్రేమింగ్ చేయడం లేదా ఇతరత్రా చొప్పించడం;
  • దేవనాగరి ద్వారా అందించబడిన ఇంటర్ఫేస్ ద్వారా కాకుండా మరే ఇత్ర మార్గంలోనైనా దేవనాగరిని పొందుట

మీరు నియమ నిబంధనలలో దేనినైనా ఉల్లంఘించినట్లుగా మాకు తెలిసినా లేదా అనుమానం వచ్చినా, మీకు మా సర్వీసులను సస్పెండ్ చేయడం లేదా ఆపేయడానికి మాకు ఏకైక విచక్షణాధికారం ఉంది.

మా సర్వీసులను వినియోగించుకోవడం వలన దేవనాగరిలోని మేధోసంపత్తికి సంబంధించిన, మా సర్వీసులు లేదా మీరు పొందగల ఏవైనా అంశాలు లేవా విషయాలకు సంబంధించిన హక్కులు మీకు ఇవ్వబడవు.

మా వ్రాతపూర్వక అనుమతిని కలిగి ఉంటే తప్ప లేదా ఈ నియంత్రణలను చట్టాలు నిషేధిస్తే తప్ప, మీరు మా సర్వీసులలో ఏదైనా భాగాన్ని కాపీ చేయడం, సవరించడం, విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయలేరు, మరియు ఇంజినీర్ ను రివర్స్ చేయడం లేదా ఆ సాఫ్ట్ వేర్ యొక్క సోర్స్ కోడ్ ను ఎక్స్ ట్రాక్ట్ చేయు ప్రయత్నం చేయలేరు.

అనువాద నాణ్యత హామి

పంపిణీ తేదీ నుండి ప్రారంభమయి 30 రోజుల నాణ్యతా హామీ అవధి ఉంటుంది, ఈ అవధిలో మీ అనువాద నాణ్యత ఫిర్యాదులను దేవనాగరి అంచనావేస్తుంది.అనువాద నాణ్యత అనేది దేవనాగరి ద్వారా అంగీకరించబడకపోయినట్లతే, మేము మీకు అనువాదాన్ని ఉచితంగా రివైజ్ చేసి ఇస్తాము.

అనువాదాన్ని రివిజన్ చేయడాన్ని తిరస్కరించడానికి దేవనాగరికి హక్కు గలదు.

రిఫండ్ పాలసీ

అనువాదకుని ద్వారా ఇంకా అంగీకరించబడని ఏ ఆర్డర్ నైనా వినియోగదారుడు రద్దు చేయవచ్చు.ఒక ఆర్డర్ ను రద్దు చేయడానికి, దేవనాగరి కస్టమర్ సపోర్ట్ ను [email protected] వద్ద సంప్రదించండి, ముందుగా అనువాదకుడు ఆ ఆర్డర్ ను అంగీకరించాడా అని చెక్ చేయండి.అనువాదకుడు ఆర్డర్ ను అంగీకరించితే, ఆర్డర్ రద్దు చేయబడదు మరియు రిఫండ్ జారీచేయబడదు.లేదా, దేవనాగరి ప్లాట్ ఫారంపై క్రెడిట్స్ రూపంలో వినియోగదారునికి రిఫండ్ చేయబడుతుంది.దేవనాగరి వరి సర్వీసులనేవైనా ఈ క్రెడిట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

అనువాదం గురించిన ఏదైనా నాణ్యతా సమస్య కోసం, వినియోగదారుడు దేవనాగరి కస్టమర్ సపోర్ట్ ను [email protected] వద్ద సంప్రదించవచ్చు మరియు సర్వీస్ పంపిణీ చేయబడినప్పటినుండి 14 రోజులలోగా సమస్యలను వివరించాలి.అనువాదం అనేది దేవనాగరి నాణ్యతా ప్రమాణాలను అందుకోలేదని దేవనాగరి నిర్ణయిస్తే,
దేవనాగరి నాణ్యతా ప్రమాణాలు అందుకోని భాష(ల)కు మాత్రమే పరిమితించునట్లుగా వినియోగదారుడు రిఫండ్ కోసం అభ్యర్థించవచ్చు, లేదా దేవనాగరిని సవరింపులు చేయాలని అభ్యర్థించవచ్చు (వివరాల కొరకు సర్వీస్ డెలివరీ పాలసీని చూడండి)కస్టమర్ రీఫండ్ ను కోరితే, ఆ కస్టమర్ ద్వారా చేయబడిన వాస్తవ చెల్లింపు ఛానల్ ద్వారానే దేవనాగరి రిఫండ్ చేస్తుంది.

నియమ నిబంధనల సవరింపులు

దేవనాగరి తన వెబ్ సైట్ మరియు తన సర్వీసుల వినియోగం యొక్క ఈ నియమ నిబంధనలను ఎప్పుడైనా నోటీసు ద్వారా లేదా నోటీసు లేకుండగనే మార్చడానికి ఏకైక విచక్షణాధికారాన్ని కలిగి ఉంది.మా సర్వీసులను వినియోగించడం ద్వారా, మీరు అమలులో ఉన్న నియమనిబంధనలను కట్టుబడి ఉన్నారని అంగీకరిస్తున్నారు.
మీకు ముందస్తు నోటీసు ఇవ్వడం ద్వారా ఛార్జీలు మరియు చెల్లింపు నిబంధనలను మా ఏకైన విచక్షణాధికారంతో మార్చవచ్చు.సవరించబడిన నియమ నిబంధనలను పూర్తిగా లేదా ఏదైనా భాగాన్ని మీరు అంగీకరించకపోతే, మీరు మా సర్వీసులను వాడడం మానుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ తెలుపబడిన ఒక నిర్దిష్ట నిబంధన లేదా నియమం అమలుచేయయోగ్యంగా లేకపోతే, అది మరే ఇతర నిబంధనలపై ప్రభావం చూపదు.
ఈ నిబంధనలు, ఏవైనా ఇతర విధానాలు లేదా దేవనాగరి గురించి సాధారణంగా మీకేవైనా ప్రశ్నలు లేదా సందేహాలుంటే, దయచేసి మాకు వివరంగా [email protected] కు ఇమెయిల్ చేయండి